Homeసినిమా వార్తలుAllu Sirish: మెగా హీరోకు ఈసారైనా హిట్టు దక్కేనా..?

Allu Sirish: మెగా హీరోకు ఈసారైనా హిట్టు దక్కేనా..?

- Advertisement -

Allu Sirish: మెగా కాంపౌండ్ నుండి ‘గౌరవం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్, ఆ తరువాత చాలా సినిమాలే చేశాడు. కానీ ఈ హీరోకు తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం పడలేదు. దీంతో చేసిన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉన్నా, ప్రేక్షకులను అలరించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఈ హీరో కెరీర్ గ్రాఫ్ ముందునుండీ పడిపోతూనే ఉంది. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ప్రేక్షకులను అలరించడంలో కాస్త సక్సెస్ అయినా, కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ గతంలోనే పూర్తయి రిలీజ్‌కు రెడీగా ఉన్నా, పలు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో ఇప్పుడు అన్ని పనులు ముగించుకుని, ఈ సినిమాను నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ తెప్పించేందుకు చిత్ర యూనిట్ విశ్వప్రయత్నాలు చేసింది. నందమూరి బాలకృష్ణను ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా పిలిచిమరీ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. కాగా, నేడు రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దానికి పలు కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు శిరీష్ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉండటం, ఫేడవుట్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఈ సినిమాలో నటిస్తుండటం లాంటివే కాకుండా, చెప్పుకోదగ్గ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు లేకపోవడం కూడా ముఖ్య కారణమని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా సక్సెస్ అయితేనే అల్లు శిరీష్ కెరీర్ గట్టెక్కుతుందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి తొలిరోజు మౌత్ టాక్ బాగా వచ్చినా, రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ సరిగా లేకపోతే అల్లు వారి హీరోకు కష్టాలు తప్పవని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు.

READ  నా పై, నా కుటుంబం పై ట్రోలింగ్ చేయిస్తుంది ఒక ప్రముఖ హీరో : మంచు విష్ణు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories