Home సినిమా వార్తలు Allu family Huge Cutout Become Talk of the Town టాక్ ఆఫ్ ది...

Allu family Huge Cutout Become Talk of the Town టాక్ ఆఫ్ ది టౌన్ గా అల్లు ఫ్యామిలీ భారీ కటౌట్

allu family cutout

లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 పై రోజురోజుకు అందరిలో కూడా విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.

డిసెంబర్ 5న గ్రాండ్ గా పుష్ప 2 మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క కటౌట్ ఒకటి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో అయితే చర్చినీయాంశంగా మారింది. అల్లు ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్, అల్లు బాబి, అల్లు అయాన్, అల్లు శిరీష్ కలిపి ఒక కటౌట్ నైతే అల్లు ఫాన్స్ ఏర్పాటు చేశారు.

ఇది ప్రస్తుతం అందరిని ఎంతో ఆకట్టుకుంటుంది. ఇటీవల మెగా ఫ్యాన్స్ తో ఒకింత కోల్డ్ వార్ అల్లు ఫ్యామిలీకి జరుగుతుండగా తాజాగా ఈ కటౌట్ వారందరికీ షాక్ ఇచ్చింది. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే అల్లు ఫ్యామిలీకి ఇటు మెగా ఫ్యామిలీకి మధ్య పక్కాగా కోల్డ్ వార్ జరుగుతోందని అలానే సినిమాల పరంగా మెగా ఫామిలీ ఫ్యాన్స్ తో కాకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ విడిగా ఉండేటటువంటి అవకాశం గట్టిగా కనపడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version