ఈ మధ్య కాలంలో హీరో గోపీచంద్ కు సరైన హిట్ లేదు. చివరిగా వచ్చిన సీటిమార్ కూడా ఆశించినంతగా ఆడలేదు.ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. నిర్మాతలుగీతా ఆర్ట్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఎందుకంటే వారి బ్యానర్ లో కూడా స్థాయికి తగ్గ హిట్ వచ్చి చాలా రోజులు అయింది. అందువల్ల ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. టైటిల్ కి తగ్గట్టుగానే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనిపించేలా ఆ ట్రైలర్ ను కట్ చేసారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా పబ్లిసిటీ కోసం అయి పెట్టిన తొలి ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టికెట్ రేట్ల గురించి, హీరో హీరోయిన్ లు సినిమా పబ్లిసిటి చేయాల్సిన అవసరం గురించి ఆయన మాట్లాడిన మాటల్లో చాలా వరకు నిజాలే ఉన్నాయి. అలాగే పక్కా కమర్షియల్ చిత్రానికి టికెట్ రెట్లు తగ్గించిన విషయం కూడా చిత్ర బృందం ప్రచారంలో భాగంగా చెప్పుకున్నారు.
ఇక రిలీజ్ కు రెడీ అయిన పక్కా కమర్షియల్ సినిమా ఫైనల్ కాపీ ని అల్లు అరవింద్ గారు చూసి దర్శకుడు మారుతిని, చిత్ర బృందాన్ని ప్రశంసించారు అని తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఎంతో అనుభవం కల అల్లు అరవింద్ గారికి సినిమా నచ్చిందంటే ఖచ్చితంగా ఆ సినిమాలో కంటెంట్ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అల్లు అరవింద్ జడ్జిమెంట్ తో ఆడియెన్స్ జడ్జిమెంట్ సరిపోతుందా లేదా అనేది తెలియాలి అంతే మరో రెండు వారాలు ఆగక తప్పదు.