Home సినిమా వార్తలు Allu Arjuns Victory Outside Setback at Home అల్లు అర్జున్ : బయట విజయం,...

Allu Arjuns Victory Outside Setback at Home అల్లు అర్జున్ : బయట విజయం, ఇంట్లో ఎదురుదెబ్బ

allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై అందరిలో మొదటి నుంచి భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. మరోవైపు సాంగ్స్, ట్రైలర్ పరంగా అంతగాకోనప్పటికీ అల్లు అర్జున్ పార్ట్ వన్ లో అదరకొట్టిన పెర్ఫార్మన్స్ తో ఈ సినిమాపై మరింత క్రేజ్ అయితే ఏర్పడింది. కాగా గ్రాండ్ గా మొన్న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఇక మరొకసారి ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్ నటుడుగా మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.

సుకుమార్ ఆశించిన స్థాయి స్క్రీన్ ప్లే రాసుకోనప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాలో అదరగొట్టారని చెప్పాలి. పుష్ప 2 కి ముందు అల్లు అర్జున్ కి తెలుగులో ఓపెనింగ్ పరంగా పెద్దగా డే 1 రికార్డ్స్ లేవు. ఆయన తన పుష్ప 2తో పలు ఆల్ టైం రికార్డులు బద్దలు కొడతారని చాలామంది ఊహించారు కానీ అది విఫలమైంది. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికీ ఈ రికార్డును కలిగి ఉంది, అయితే ఇతర భాషలను మరియు ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ పనితీరును పరిగణనలోకి తీసుకుంటే, పుష్ప 2 టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనర్ అవుతుంది.

అల్లు అర్జున్ తన సొంత తెలుగు ఏరియాలో ఎదురుదెబ్బ తిన్నప్పటికీ బయట రాష్ట్రాల్లో మాత్రం విజయం సాధించాడు. వాస్తవానికి పుష్ప 1 మూవీ తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల లాస్ వెంచర్ గా మిగిలిపోయింది. కాగా పుష్ప 2 కి మంచి సక్సెస్ టాక్ రావడంతో ఇది రాబోయే రోజుల్లో దాదాపుగా చాలా ప్రాంతాల్లో మంచి రికార్డ్స్ ని నెలకొల్పే అవకాశం కనపడుతోంది. మరి ఫైనల్ గా లాంగ్ రన్ లో ఇది ఎంతమేర రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version