ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై అందరిలో మొదటి నుంచి భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. మరోవైపు సాంగ్స్, ట్రైలర్ పరంగా అంతగాకోనప్పటికీ అల్లు అర్జున్ పార్ట్ వన్ లో అదరకొట్టిన పెర్ఫార్మన్స్ తో ఈ సినిమాపై మరింత క్రేజ్ అయితే ఏర్పడింది. కాగా గ్రాండ్ గా మొన్న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఇక మరొకసారి ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్ నటుడుగా మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.
సుకుమార్ ఆశించిన స్థాయి స్క్రీన్ ప్లే రాసుకోనప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాలో అదరగొట్టారని చెప్పాలి. పుష్ప 2 కి ముందు అల్లు అర్జున్ కి తెలుగులో ఓపెనింగ్ పరంగా పెద్దగా డే 1 రికార్డ్స్ లేవు. ఆయన తన పుష్ప 2తో పలు ఆల్ టైం రికార్డులు బద్దలు కొడతారని చాలామంది ఊహించారు కానీ అది విఫలమైంది. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికీ ఈ రికార్డును కలిగి ఉంది, అయితే ఇతర భాషలను మరియు ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ పనితీరును పరిగణనలోకి తీసుకుంటే, పుష్ప 2 టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనర్ అవుతుంది.
అల్లు అర్జున్ తన సొంత తెలుగు ఏరియాలో ఎదురుదెబ్బ తిన్నప్పటికీ బయట రాష్ట్రాల్లో మాత్రం విజయం సాధించాడు. వాస్తవానికి పుష్ప 1 మూవీ తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల లాస్ వెంచర్ గా మిగిలిపోయింది. కాగా పుష్ప 2 కి మంచి సక్సెస్ టాక్ రావడంతో ఇది రాబోయే రోజుల్లో దాదాపుగా చాలా ప్రాంతాల్లో మంచి రికార్డ్స్ ని నెలకొల్పే అవకాశం కనపడుతోంది. మరి ఫైనల్ గా లాంగ్ రన్ లో ఇది ఎంతమేర రాబడుతుందో చూడాలి.