Home సినిమా వార్తలు అవతార్-2 ధియేటర్లలో పుష్ప ది రూల్ టీజర్

అవతార్-2 ధియేటర్లలో పుష్ప ది రూల్ టీజర్

పుష్పా ది రూల్.. ప్రస్తుతం భారత దేశం అంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చలనచిత్రాలలో ఒకటి. పుష్ప పరిధి దేశ సరిహద్దులను కూడా దాటిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా పుష్ప రెండో భాగం (పుష్ప ది రూల్) టీజర్ త్వరలో రానుంది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, పుష్ప 2 టీజర్ రెడీ అవుతోంది. అంతే కాక అవతార్ 2 చిత్రానికి ఈ టీజర్ ను జోడించే అవకాశం ఉందట.

అవతార్ 2 సినిమాతో పాటు జత చేయాల్సిన టీజర్ కంటెంట్‌ని పంపడం కోసం ఇటీవలే చిత్రీకరణ కూడా జరుపుకుంది. అవతార్ 2 చిత్రం దేశవ్యాప్తంగా విస్తృతంగా విడుదల అవుతుంది కాబట్టి.. పుష్ప 2కి కూడా ఇది మంచి లాంచింగ్ ప్యాడ్ అవుతుంది.

ఈ రోజుల్లో, ప్రేక్షకులు ఒక సినిమా నుంచి ఆసక్తిగా చూసే మొదటి కంటెంట్ టీజర్. టీజర్‌లోని అంశాలను బట్టి ప్రజలు సినిమా ఎలా ఉండబోతుందో ఒక అంచనాకు వస్తారు. టీజర్ తోనే కొన్ని పెద్ద సినిమాలు పేలవంగా కూడా కనిపించాయి.

ఇటీవలే పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్‌ వల్ల అనుకొని ఎదురుదెబ్బ తగిలిన ఆదిపురుష్ టీజర్ ఉదంతం అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కంటెంట్ సంగతి పక్కన పెడితే టీజర్ లాంచ్ కూడా ముఖ్యం. పుష్ప మేకర్స్ కూడా ఈ టీజర్ లాంచ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఇక టీజర్ లాంచ్ కోసం ఆదిపురుష్ చిత్ర బృందం అయోధ్యకు వెళ్లిన సంగతి తెలిసిందే.

అవతార్ 2 పుష్ప 2కి మంచి లాంచింగ్ ప్యాడ్‌గా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా పిల్లలు థియేటర్‌లకు తరలివస్తారు. అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్ ధియేటర్లలో ప్రేక్షకులు అవతార్ 2 చిత్రంతో పాటుగా పుష్ప 2 టీజర్‌ను చూసి ఆనందిస్తారు.

ఈ భారీ ప్రచార వ్యూహం ఉత్తర భారత మార్కెట్‌ పై పెద్ద ప్రభావం చూపనుంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈ పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ తెరకెక్కించడంలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వడం లేదు. ఇక రష్మిక మొదటి భాగం నుండి తన పాత్రను కొనసాగిస్తారు. ఈ యాక్షన్ డ్రామాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version
WordPress › Error

Error establishing a Redis connection

To disable Redis, delete the object-cache.php file in the /wp-content/ directory.