పుష్ప 2021లో విడుదలైన అతిపెద్ద ప్యాన్-ఇండియన్ చిత్రం. పుష్ప పాత్ర, పాటలు, డైలాగ్‌లు, తగ్గేదే లే మ్యానరిజం, ఇలా పుష్ప సినిమా గురించిన ప్రతి ఒక్క అంశం ప్రేక్షకులకు ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు కేరళలో పుష్ప మరోసారి సినిమాను తెర పై ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. కేరళలో పుష్ప సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ కేరళలో భారీ స్టార్ డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కేరళలోని అతిపెద్ద స్టార్లలో ఒకరు మరియు అక్కడి ప్రేక్షకులు ఆయనను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఐకాన్ స్టార్‌కి కూడా ఈ విషయం తెలుసు, అందుకే కేరళలోని తన అభిమానుల కోసం ప్రమోషన్లు మరియు డబ్బింగ్ కార్యకలాపాలు చేయడంలో ప్రత్యేక ఆసక్తిని చూపుతుంటారు.
కేరళలో అల్లు అర్జున్ క్రేజ్‌కి కొత్త సాక్ష్యం పుష్ప రీ-రిలీజ్‌తో చూడవచ్చు. పుష్పకి అప్పుడే ఏడాది పూర్తయింది, మొదటి సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సినిమా మళ్లీ విడుదల కావడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ మాస్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 17న మళ్ళీ విడుదల కానుంది మరియు ఈసారి కూడా ‘తగ్గేదే లే’ అని సంబరాలు జరుపుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తితో ఉన్నారు.
ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా ఉన్నారు, నిజానికి ఆయన పాత్ర తక్కువ సన్నివేశాలను కలిగి ఉన్నప్పటికీ సినిమాకి చాలా కీలకంగా మారింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక, దేవి శ్రీ ప్రసాద్‌ల చార్ట్ బస్టర్ సంగీతం పుష్ప సినిమాను మరింత ఎత్తుకు చేర్చాయి.
సుకుమార్ ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లే మరియు బన్నీ కోసం ఆయన డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ పుష్పను భారతదేశం అంతటా బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా చేసాయి. ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ జరుపుకుంటున్న వేళ, కేరళలో రీ-రిలీజ్ చేయడం శుభారంభంగా ఉంటుంది. పుష్ప సినిమా రీ రిలీజ్ లో మరోసారి భారీ హిట్ అవుతుందని ఆశిద్దాం.
ఇదిలా ఉండగా పుష్ప-2 షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నవంబర్ 13న బ్యాంకాక్ అడవుల్లో తొలి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం ఇది 2 వారాల షెడ్యూల్ గా ఉంటుందని అంటున్నారు. కాగా పుష్ప-2 షూటింగ్ పార్ట్ ఎక్కువ భాగం అడవుల్లోనే జరుగుతుందని తెలుస్తోంది.