మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.
అయితే దీని అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో హారికా హాసిని, గీత ఆర్ట్స్ సంస్థ పై త్రివిక్రమ్ ఒక భారీ మూవీని తెరకెక్కించనున్నారు. ఇటీవల దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ ద్వారా తొలిసారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్న త్రివిక్రమ్, అల్లు అర్జున్ ని గ్రాండ్ గా చూపించేందుకు ప్రస్తుతం పవర్ఫుల్ గా స్టోరీ, స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.
ఇతిహాసాల నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని బాక్సాఫీస్ పరంగా గ్రాండ్ సక్సెస్ అయ్యేలా నిర్మించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.