అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 మరొక రెండు రోజుల్లోగ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అనసూయ, సునీల్, ఫహాద్ ఫాసిల్, రావు రమేష్ నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.
ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ మూవీ కోసం టీమ్ అంతా కూడా దాదాపుగా మూడేళ్ళుగా ఎంతో కష్టపడ్డరని, తప్పకుండా మూవీ అందరినీ మెప్పిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. విషయం ఏమిటంటే, ఇండియా లెవెల్లో తెలుగు సినిమా రేంజ్ మరింతగా విస్తరిస్తోందని అన్నారు. గతంలో ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు తెలుగు ఖ్యాతిని ఎంతో పెంచగా ఆ కోవలోకి తమ పుష్ప మూవీ కూడా వస్తుందని తెలిపారు అల్లు అర్జున్.
అయితే ఇటీవల ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తీసిన కల్కి 2898 ఏడి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టి రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన విషయం ఆయన మిస్ అయ్యారు. అయితే కావాలనే అల్లు అర్జున్ కల్కి మూవీ గురించి స్కిప్ చేశారా లేక మర్చిపోయారా అనేది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. మరి డిసెంబర్ 5న రిలీజ్ కానున్న పుష్ప 2 ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.