టాలీవుడ్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ 5న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో అత్యధిక వ్యయంతో నిర్మించింది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే నుండే అందరి నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ఈ మూవీ యొక్క ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో మూవీ చూసారు అల్లు అర్జున్. అదే సమయంలో థియేటర్ ఆవరణలో పెద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషమంగా మారింది. కాగా ఆ ఘటన తో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, నేడు కొద్దిసేపటి క్రితం ఆయనని అరెస్ట్ చేసారు.
మొత్తంగా అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అవి 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్, 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయ్యాయి. కాగా వీటితో ఆయనకు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం అలానే BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ కేసు పై రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.