ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 నిన్న గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక ప్రీమియర్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు నటించారు.
ఇక ఈ మూవీలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ సూపర్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి పేరు లభించింది. అయితే ఈ మూవీ యొక్క ప్రీమియర్ ని హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో వీక్షించారు అల్లు అర్జున్. అయితే ఆయన థియేటర్ కి విచ్చేసిన ఆ సమయంలో ఒక్కసారిగా భారీ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందడంతో పాటు ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషమంగా మారింది.
కాగా ఆ ఘటన పై కొద్దిసేపటి క్రితం స్పందించిన అల్లు అర్జున్, ఆ దుర్ఘటన విని తమ టీమ్ మొత్తం కూడా ఎంతో షాక్ కి గురైందని అన్నారు. ఇక రేవతి గారితో పాటు వారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం అని, ప్రస్తుతం తన తరపున వారికి రూ. 25 లక్షలు పరిహారం అందిస్తున్నట్లు ఒక వీడియో బైట్ ద్వారా తెలిపారు అల్లు అర్జున్.