వాస్తవానికి అలవైకుంఠపురములో మూవీ యొక్క పెద్ద విజయంతో కెరీర్ పరంగా పెద్ద హిట్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఆ మూవీలోని సాంగ్స్ కూడా నేషనల్ వైడ్ పాపులర్ అవడంతో మరింత పేరు అందుకున్నారు. అనంతరం సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 1 తో అటు నార్త్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుని ఏకంగా ఆ మూవీలో కనబరిచిన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.
అనంతరం దానికి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన పుష్ప 2 మూవీ అంతకుమించి రూ. 1670 కోట్ల మేర వరల్డ్ వైడ్ గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీతో హీరోగా అల్లు అర్జున్ రేంజ్, మార్కెట్ వేల్యూ అమాంతంగా పెరిగిపోయిందని చెప్పాలి. అయితే ఈ మూవీ తరువాత కోలీవుడ్ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్.
అయితే పుష్ప 2 తరువాత పుష్ప 3 మూవీ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు. కాగా తాజగా దానికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, పుష్ప 3 మూవీ వీలైనంత వరకు 2028 లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం అన్నారు.
ప్రస్తుతం అట్లీ మూవీ కోసం సిద్దమవుతున్న అల్లు అర్జున్, దాని అనంతరం త్రివిక్రమ్ మూవీ చేస్తారని, అవి రెండిటి తరువాత పుష్ప 3 కూడా ఫాస్ట్ గా షూట్ జరుపుకుంటుందని తెలిపారు. మరోవైపు రామ్ చరణ్ మూవీ కోసం ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని అన్నారు. మొత్తంగా దీనిని బట్టి 2028లో అల్లు అర్జున్ పుష్ప 3 తో ఆడియన్స్ ముందుకి రావడం ఖాయం అని తెలుస్తోంది.