పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ సూపర్ డూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి. ఇక తమ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మొదట ప్రకటించిన మేకర్స్, కొన్ని టెక్నీకల్ కారణాల రీత్యా దానిని డిసెంబర్ 6 కి వాయిదా వేసి ఫిక్స్ చేసినట్లు ఇటీవల ప్రకటించారు.
విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మరొక్కసారి పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు చెప్తున్నారు. కారణాలు తెలియరానప్పటికీ అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడిందని, కాగా ఇది మార్చి చివరివారం లేదా ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే దీని పై టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది.