ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ పై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడేళ్ళ క్రితం రిలీజ్ అయిన పుష్ప 1 మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు పుష్ప రాజ్ గా అద్భుత నటన కనబరిచిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం.
మైత్రి మూవీ మేకర్స్ మరింత గ్రాండ్ గా నిర్మిస్తున్న పుష్ప 2 మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహాద్ ఫాసిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్న పుష్ప 2 మూవీని డిసెంబర్ 2న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అయితే మూవీకి సంబంధించి మరికొంత వర్క్ పెండింగ్ ఉండడంతో మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడనుందని కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.
విషయం ఏమిటంటే, తాజాగా ఒక మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ఓవైపు పుష్ప 2 మూవీకి సంబంధించి వర్క్ అంతా వేగంగా జరుగుతోందని, తాజా షెడ్యూల్ లో మిగతా పార్ట్ మొత్తం త్వరలో పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అలానే డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ ని మిస్ అయ్యేది లేదని, దయచేసి రిలీజ్ కి సంబంధించి వస్తున్న పుకార్లు నమ్మద్దని అన్నారు.