టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప 2 మూవీ చేస్తున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియన్ రేంజ్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మూడేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న పుష్ప 2 నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈమూవీలో పుష్ప రాజ్ గా మాస్ పవర్ఫుల్ లుక్ లో అల్లు అర్జున్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. విషయం ఏమిటంటే, తాజాగా ట్రిమ్ చేసిన గడ్డం లుక్ తో ఎయిర్పోర్ట్ లో కనిపించారు అల్లు అర్జున్.
అయితే ఈ మూవీలో తన పాత్ర కోసం ఫుల్ గా గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఒక్కసారిగా దానిని ట్రిమ్ చేసి కనిపించడంతో మూవీ షూట్ కి బ్రేక్ పడిందా, హీరోకి దర్శకుడికి మధ్య ఏమైనా వివాదాలు తలెత్తాయ అనే అంశమై ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పుష్ప 2 టీమ్ నుండి అందుతున్న న్యూస్ ప్రకారం అటువంటిది ఏమి లేదని, అనుకున్న ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని, పక్కాగా డిసెంబర్ 6న తమ మూవీ థియేటర్స్ లో ఉంటుందని వారు వెల్లడించినట్లు తెలుస్తోంది.