టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తీస్తున్న పుష్ప 2 ది రూల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ నుండి తాజాగా రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే దీని తరువాత హారికా హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థల పై త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించనున్న పాన్ ఇండియన్ మూవీని అల్లు అర్జున్ చేయనున్నట్లు ఇటీవల అఫీషయల్ ప్రకటన కూడా వచ్చింది. కాగా ఆయన ఆ మూవీ కొన్నాళ్ళు ప్రక్కన పెట్టి తమిళ యువ దర్శకుడు అట్లీ తో ఒక మంచి మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారని ఇటీవల మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ టాక్ ప్రకారం అట్లీ తో అల్లు అర్జున్ చేయనున్న మూవీ ఇక లేనట్లే అని తెలుస్తోంది. త్వరలో సల్మాన్ ఖాన్ తో ఒక మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అట్లీ. మరోవైపు అల్లు అర్జున్ పక్కాగా పుష్ప 2 అనంతరం త్రివిక్రమ్ తో మూవీ ఫిక్స్ ని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ గురించిన పూర్తి డీటెయిల్స్ వెల్లడి కానున్నాయి.