Home సినిమా వార్తలు కెరీర్ లో తొలిసారిగా ఆ ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ 

కెరీర్ లో తొలిసారిగా ఆ ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ 

allu arjun atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి  సొంతము చేసుకుని పాన్ ఇండియన్ హీరోగా మరింత భారీ క్రేజ్, మార్కెట్ సొంతం చేసుకున్నారు. ఇక దీని అనంతరం యువ దర్శకుడు అట్లీ తో ఒక భారీ పాన్ ఇండియన్ కమర్షియల్ మూవీ చేయనున్నారు అల్లు అర్జున్. 

ప్రస్తుతం ఆ మూవీ యొక్క కథ, కథనాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్, అట్లీ మధ్య ఈ మూవీ విషయమై కథా చర్చలు జరగడం మూవీ ఫిక్స్ అవ్వడం కూడా జరిగింది. 

ఇక ఈ ప్రతిష్టాత్మక క్రేజీ కాంబినేషన్ మూవీని కోలీవడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు గ్రాండ్ గా నిర్మించనున్నారు. యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ స్వరాలు సమకూర్చనున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ పరంగా ట్రెండీ స్టైల్ లో సిద్ధమయ్యారు అల్లు అర్జున్. 

కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ ద్వారా తొలిసారిగా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నారట .కాగా తన కెరీర్ లో తీసిన బిగిల్, మెర్సల్, జవాన్ సినిమాల్లో హీరోలతో ట్రిపుల్, డ్యూయల్ రోల్ మూవీస్ తీసి మంచి విజయాలు సొంతం చేసుకున్నారు అట్లీ. 

కాగా ఈ మూవీలోని క పాత్ర లో అల్లు అర్జున్ నెగటివ్ షేడ్స్ లో కనిపించనున్నాట్లు టాక్. త్వరలో ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version