Home సినిమా వార్తలు Allu Arjun in Jail Tonight బ్రేకింగ్ : ఈ రాత్రికి జైల్లోనే అల్లు అర్జున్

Allu Arjun in Jail Tonight బ్రేకింగ్ : ఈ రాత్రికి జైల్లోనే అల్లు అర్జున్

allu arjun latest

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రాగా దీనికి సంబందించిన ప్రీమియర్ ని ప్రత్యేకంగా ఫ్యామిలీతో కలిసి వీక్షించేందుకు అంతకముందు రోజూ రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ కి వెళ్లారు అల్లు అర్జున్. అయితే ఆ సమయంలో థియేటర్ ప్రాంతంలో పూర్తిగా తొక్కిసలాట జరిగి ఒక యువతీ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

దానితో థియేటర్ యాజమాన్యం అలానే అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. నేడు ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని అరెస్ట్ చేసారు పోలీసులు. అనంతరం ఆయనని కోర్ట్ లో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

కాగా దానిని సవాలు చేస్తూ నేడు అల్లు అర్జున్ తరపు లాయర్లు తెలంగాణ హై కోర్టులో బెయిల్ కోసం వాదనలు వినిపించి ఫైనల్ గా మధ్యంతర బెయిల్ అయితే సంపాదించారు. ఇంతవరకు అంతా బాగున్నప్పటికీ దానికి సంబంధించి కట్టాల్సిన రూ. 50000 పూచికత్తు బాండ్లు తీసుకుని లాయర్లు చంచల్గూడ జైలుకు వెళ్లి అధికారులతో మాట్లాడారు.

కాగా అంతకుముందు అల్లు అర్జున్ విడుదల ప్రక్రియ కొన్ని గంటల పాటు సాగింది. ఇక అల్లు అర్జున్ కోసం జైలు సిబ్బంది బ్యారక్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ విడుదల ప్రక్రియలో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అల్లు అరవింద్ చంచల్గూడ జైలు నుండి ఇంటికి వెళ్లిపోయారు.

ఇక జైలు వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు తమ హీరో ఈ రోజే విడుదల అవుతారని ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. అలానే అటు అల్లు అర్జున్ సన్నిహితులు, బంధువులు ఆయన ఇంటి వద్ద వేచి ఉన్నారు. కాగా రేపు ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version