అల్లు అర్జున్ తన సహనటులు, ఇండస్ట్రీ సహచరులందరితోనూ సత్సంబంధాలు ఉంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘నాటు నాటు’ పాట ఆస్కార్ విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు యూనిట్ మొత్తాన్ని అభినందిస్తూ ఐకాన్ స్టార్ హృదయపూర్వక లేఖను కూడా పంచుకున్నారు.
కానీ, బన్నీ ఇప్పుడు తన సహనటుల్లో ఒకరిని ఆశ్చర్యకరంగా సోషల్ మీడియాలో బ్లాక్ చేరడంతో వార్తల్లో నిలిచారు. నటి భానుశ్రీ మెహ్రాను ఆయన ట్విట్టర్ లో బ్లాక్ చేశారు. 2010లో అల్లు అర్జున్ సరసన ‘వరుడు’ చిత్రంతో తెరంగేట్రం చేసరు భానుశ్రీ మెహ్రా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవ్వడంతో ఈ నటి అనతికాలంలోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వరుడు తర్వాత ఈ హీరోయిన్ కు పెద్దగా సినిమాలు కూడా లేవు. కొన్ని తెలుగు, తమిళ చిత్రాలతో పాటు పలు పంజాబీ చిత్రాల్లో నటించినా కూడా ఆమెకు బాక్సాఫీస్ వద్ద అదృష్టం కలిసి రాలేదు అనే చెప్పాలి.
భానుశ్రీ మెహ్రా గత కొన్నేళ్లుగా తన యూట్యూబ్ ఛానల్ తో బిజీగా ఉంటూ ఆన్ లైన్ లో తన పోస్ట్ లను షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే నెటిజన్లు చెప్తున్న మాటలు నమ్మితే ఆమె నిరంతరం ట్విట్టర్ లో సెలబ్రిటీ పోస్టుల కింద తన యూట్యూబ్ లింక్స్ షేర్ చేయడం, ఐకాన్ స్టార్ తో సహా పలువురిని ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది. తనను బ్లాక్ చేసిన అల్లు అర్జున్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ను భాను షేర్ చేశారు.