టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెల్సిందే. ఇక ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. సుకుమార్ తీస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ తప్పకుండా రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం అని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా తన స్నేహితుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శిల్ప రవి రెడ్డికి మద్దతుగా నంద్యాల చేరుకొని ఆయన తరపున క్యాంపెయినింగ్ చేసారు అల్లు అర్జున్.
ఆ సందర్భంగా భారీ స్థాయిలో జనసందోహంతో క్యాంపెయిన్ చేయడం ఎలక్షన్ కోడ్ కి విరుద్ధం అని హై కోర్ట్ లో కేసు నమోదు చేయబడింది. ఇక ఇటీవల ఈ కేసు హియరింగ్ కి రావడంతో నేడు దానిని జడ్జి కొట్టివేశారు. దానితో అల్లు అర్జున్ కు పెద్ద రిలీఫ్ లభించినట్లయింది. అయితే శిల్ప రవి రెడ్డి కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం పై మెగా ఫ్యాన్స్ ఆయన పై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.