Home సినిమా వార్తలు అట్లీ మూవీలో అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్ ?

అట్లీ మూవీలో అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్ ?

allu arjun atlee

ఇటీవల పుష్ప 2 మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అతిపెద్ద విజయం అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈమూవీని సుకుమార్ తెరకెక్కించారు. దాని అనంతరం త్రివిక్రమ్ తో ఒక మైథలాజికల్ మూవీ అనౌన్స్ చేసిన అల్లు అర్జున్, ప్రస్తుతం అది కొన్నాళ్ళు ప్రక్కన పెట్టి అట్లీతో సినిమా చేస్తున్నారు.

భారీ స్థాయిలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈమూవీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో సాగనున్నట్లు తెలుస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రలను పోషించబోతున్నాడు, దీనికి తాత్కాలికంగా AA22 x A6 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.

అయితే మూడు పాత్రల్లో ఒకటి.అత్యంత సంచలనాత్మకమైనదని, అలానే అది పూర్తిగా యానిమేటెడ్ పాత్రని టాక్. కాగా భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రముఖ నటుడు ఒక మూవీలో పూర్తిగా యానిమేటెడ్ పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఒకరకంగా ఇది డేరింగ్ స్టెప్ అని అంటున్నాయి సినీ వర్గాలు.

ఆపాత్రని ఎంతో బాగా డిజైన చేసారని, తప్పకుండా అది అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. తన కెరీర్ లో ఒక్కొక్కటిగా సక్సెస్ మెట్లు ఎక్కుతూ మంచి క్రేజ్ అందుకుంటున్న అల్లు అర్జున్ ఈ మూవీతో ఎంతమేర విజయం అందుకుంటారో చూడాలి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version