Homeసినిమా వార్తలుఅల్లు అర్జున్ - అట్లీ మూవీ బడ్జెట్ వింటే షాక్ అవ్వడం ఖాయం

అల్లు అర్జున్ – అట్లీ మూవీ బడ్జెట్ వింటే షాక్ అవ్వడం ఖాయం

- Advertisement -

ఇటీవల పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ స్థాయి విజయం సొంతం చేసుకొని మరింత క్రేజ్, మార్కెట్ ని ఏర్పరుచుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీ అనంతరం ఇప్పటికే రెండు సినిమాలు లైన్ లో పెట్టారు బన్నీ. అందులో ఒకటి హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మైథాలజీ మూవీ.

దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనుండగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు తాజాగా అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న సినిమా యొక్క అనౌన్స్మెంట్ గ్లింప్స్ టీజర్ వచ్చింది. దానిని బట్టి ఇది సైన్స్ ఫిక్షన్ జానాల్లో సాగే గ్రాండియర్ విజువల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకి దాదాపుగా రూ. 600 కోట్లకు పైగా భారీ ఖర్చుని పెట్టనున్నారని, అలానే ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా దర్శక నిర్మాతలు ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని టాక్.

READ  'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సెన్సార్ రిపోర్ట్ 

ఇక ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. తన కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని ఒక డిఫరెంట్ జానర్ మూవీని అట్లీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారట.

అందులో ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ తో సాగునుందని అంటున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా 2026 ద్వితీయార్థంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు దీనితోపాటు ఈ ఏడాదిలోనే త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అల్లు అర్జున్.

Follow on Google News Follow on Whatsapp

READ  'మ్యాడ్ స్క్వేర్' కి బీజీఎమ్ అందించనున్న థమన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories