Home సినిమా వార్తలు Allu Arjun Assured But Did Not Apologize అల్లు అర్జున్ హామీ ఇచ్చాడు కానీ...

Allu Arjun Assured But Did Not Apologize అల్లు అర్జున్ హామీ ఇచ్చాడు కానీ క్షమాపణ చెప్పలేదు

allu arjun

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 రెండు రోజుల క్రితం గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ఫస్ట్ డే ప్రీమియర్స్ నుంచి మంచి సక్సెస్ టాక్ సంపాదించుకొని ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతుంది. అయితే ప్రీమియర్స్ ప్రదర్శన సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్లో రాత్రి 9:30 సమయంలో తన కుటుంబంతో కలిసి పుష్ప 2 మూవీ చూశారు అల్లు అర్జున్. ఆ సందర్భంలో ఆ థియేటర్ చుట్టుప్రక్కల ప్రాంగణంలో భారీ స్థాయి తొక్కిసలాటైతే జరిగింది.

దానితో ఒక మహిళ మరియు ఆమె కుమారుడు మృతి చెందారు. ఆ ఘటనతో ఇకపై పెద్ద సినిమాల స్పెషల్ షోస్ ని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిని ఆదుకుంటామంటూ నిన్న రాత్రి అల్లు అర్జున్ ఒక వీడియోని రిలీజ్ చేసి వారికి రూ. 25 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. అయితే ఈ దుర్ఘటనతో తను అండ్ పుష్ప 2 టీమ్ మొత్తం చాలా బాధపడ్డామని ఆ వీడియోలో చెప్పిన అల్లు అర్జున్ ఆ ఘటనకు ఆయన బాధితులకు క్షమాపణ అయితే చెప్పలేదు.

దానితో పలువురు అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయినా ఘటన జరిగి బాధితులు మరణించిన తరువాత మొక్కుబడిగా వీడియో రిలీజ్ చేసి పరిహారం అందించడం ఏమిటని, అతడిలో పశ్చాత్తాపం ఏ మాత్రం లేదని దుయ్యబడుతున్నారు. మొత్తంగా ఈ విషాద ఘటన టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version