Homeసినిమా వార్తలు14 ఏళ్ళ తరువాత మళ్ళీ రిపీట్ అయినా కాంబో

14 ఏళ్ళ తరువాత మళ్ళీ రిపీట్ అయినా కాంబో

- Advertisement -

అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో తెలుగు యువ హీరో అక్కినేని వారసుడు నాగ చైతన్య బాలీవుడ్ లో ఆరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ఈ చిత్రంలో అతిథి పాత్రలోనే నటిస్తున్నప్పటికీ కథకి చాలా కీలకమైన పాత్ర అట. అమీర్ ఖాన్ తో కలసి చైతన్య ఈ చిత్రంలో సైనికుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా కనిపిస్తుండటం విశేషం.

ఆగష్టు 11న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయినట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నాయి. చాలా కాలం తరువాత ఒక పెద్ద హీరో సినిమా విడుదల అవుతున్న దశలో ఈ సినిమా పై బాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు అమీర్ ఖాన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా తెలుగులో ఈ చిత్రానికి క్రేజీ డీల్ కుదిరింది. లాల్ సింగ్ చద్దా తెలుగు రిలీజ్ హక్కులని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. భారీ ధరకు ఆయన ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయనున్నారు.

READ  సుడల్ (వెబ్ సీరీస్) : ఆసక్తికరమైన అంశాలతో పాటు ఆలోచింపజేసే ప్రయత్నం

ఏకంగా అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాత రంగంలోకి దిగి ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా కంటెంట్ పైఅంచనాలు పెరిగాయి. లాల్ సింగ్ చద్దాలో ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టి పడేసే అంశాలు ఉంటాయి అని సమాచారం.

గతంలో అల్లు అరవింద్.. అమీర్ ఖాన్ తో గజినీ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా అమీర్ ఖాన్ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి గా నిలిచింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని లాభాలు తెచ్చిపెట్టింది. మరిప్పుడు లాల్ సింగ్ చద్దా మరెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూద్దాం. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఫీమేల్ లీడ్ గా నటించింది.

Follow on Google News Follow on Whatsapp

READ  సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నాజర్?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories