ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన మూవీ గేమ్ ఛేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మించారు. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయింది.
అయితే తన బ్యానర్ ద్వారా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ని కూడా సంక్రాంతి బరిలో నిలిపి పెద్ద విజయం అందుకున్నారు రాజు. ఇక ఇటీవల తండేల్ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు ని ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ మీ బ్యానర్ లో వచ్చిన రెండు మూవీస్ మొన్న సంక్రాంతికి రిలీజ్ అవ్వగా, అందులో ఒక మూవీ హై కి మరొక మూవీ లో కి వెళ్ళింది అంటూ గేమ్ ఛేంజర్ పై పరోక్షంగా కామెంట్స్ చేసారు.
అనంతరం మరొక ఇంటర్వ్యూలో భాగంగా చరణ్ ఫస్ట్ మూవీ చిరుత హిట్ అయితే అది యావరేజ్ అని సంబోధించారు అరవింద్. మొత్తంగా ఈ రెండు విషయాల ద్వారా మెగా ఫ్యాన్స్ నుండి అల్లు అరవింద్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే నిన్నటి తండేల్ మీట్ లో భాగంగా ఈ విషయాన్నీ ఒక రిపోర్ట్ ప్రస్తావించి దీని పై మీ కామెంట్స్ ఏంటి అని అల్లు అరవింద్ ని అడుగగా ఆయన షాకింగ్ గా నో కామెంట్స్ అంటూ రిప్లై ఇచ్చారు. మొత్తంగా ఈ న్యూస్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.