ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషలు ఆడియన్స్ ముందుకు అయితే రానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని భారీ వ్యయంతో నిర్మించింది.
ఇక ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఎప్పటికప్పుడు తన సినిమాల యొక్క క్లైమాక్స్ కి రెండు వర్షన్స్ రాస్తూ ఉంటారు సుకుమార్ అలానే పుష్ప 2 కు కూడా క్లైమాక్స్ రెండు వర్షన్స్ ఆయన రాశారట. ఇటీవల వాటిని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కి పుష్ప 2 మూవీతో పాటు రెండు వెర్షన్స్ క్లైమాక్స్ తో చూపించారట.
అయితే ఆ రెండింటిలో ఒకటి ఫైనల్ గా ఫిక్స్ చేసిన అల్లు అరవింద్ ఇటీవల మరొక్కసారి సినిమా మొత్తం చూసి ఆనందం వ్యక్తం చేశారట. ఆ క్లైమాక్స్ వర్షన్ అయితే అద్భుతంగా వచ్చిందని ఓవరాల్ గా పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం ఖాయమని టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి అందరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.