Homeసినిమా వార్తలుఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం టీజర్ : అల్లరి నరేష్ నుండి మరో మంచి ప్రయత్నం

ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం టీజర్ : అల్లరి నరేష్ నుండి మరో మంచి ప్రయత్నం

- Advertisement -

ఎప్పుడు కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్ ఈ మధ్య తన రూటు మార్చారు. నాంది సినిమాతో నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన నాంది సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మారేడుమిల్లి ప్రజానీకం.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ సంస్థ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండు, బాలాజీ గుత్త నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.ఇది వరకే విడుదలైన పోస్టర్లు సినిమా పై ఆసక్తిని పెంచాయి.

ఇక మంగవారం ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ రిలీజ్ చేశారు.మారేడుమిల్లి అడవుల్లో 55 రోజుల పాటు షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సినిమా కోసం 250 మంది అడవుల్లో కష్టపడ్డారని తెలిపారు.ఈ సినిమా కోసం మారేడుమిల్లి అడవుల్లో ఇప్పటివరకు ఎవరు షూట్ చేయని 22 లొకేషన్స్ లో తాము షూటింగ్ చేశామని,ఉదయాన్నే 3 గంటలకు లేచి కాలినడక లొకేషన్స్ కు వెళ్లడం చూపించారు.

READ  Box-Office: నాని అంటే సుందరానికీతో మళ్ళీ కొట్టాడు

ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. టీజర్ విషయానికి వస్తే ఈ సినిమా హిందీలో రాజ్ కుమార్ రావు నటించిన “న్యూటన్” కు రీమేక్. అటవీ ప్రాంత నేపథ్యంలో అక్కడి రాజకీయాలు, ఎన్నికలు వంటి అంశాలు స్పృశించారు టీజర్ లో.”సాయం చేస్తే మనిషి..దాడి చేస్తే మృగం” అంటూ హీరోయిన్ అనంది డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది.మొత్తానికి నాంది తరువాత అల్లరి నరేష్ 2.0 లా అనిపిస్తూ మరోసారి ఆసక్తికరమైన కథతో వస్తున్నారు.ఆ ప్రయత్నంలో అల్లరి నరేష్ మరియు చిత్ర బృందం విజయం సాధించాలని కోరుకుందాం.

#ItluMaredumilliPrajaneekam Official TEASER | Allari Naresh | AR Mohan | Zee Studios | Hasya Movies

శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చగా,విభిన్నమైన కథతో రాబోతున్న ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు అమ్మాయి అయినా ఇక్కడ కన్నా తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసిన ఆనంది, ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా చేస్తోంది. వెన్నెల కిశోర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. అల్లరి నరేశ్ కి ఇది 59వ సినిమా కాగా, తన 60వ సినిమాను ఆయన మళ్ళీ ‘నాంది’ దర్శకుడితో చేస్తున్న సంగతి తెలిసిందే.

READ  నారప్ప తో ఖిలాడి అంటున్న అడ్డాల

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories