Homeసినిమా వార్తలుAndhrawala: థియేటర్లలో మళ్ళీ విడుదలవుతున్న అల్ టైమ్ డిజాస్టర్ ఆంధ్రావాలా

Andhrawala: థియేటర్లలో మళ్ళీ విడుదలవుతున్న అల్ టైమ్ డిజాస్టర్ ఆంధ్రావాలా

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో పాత బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ సర్వ సాధారణంగా మారింది. కాగా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ సీనియర్ నుంచి నేటి స్టార్ హీరోల వరకూ చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అయితే ఆంధ్రావాలా లాంటి ఆల్ టైమ్ డిజాస్టర్ మళ్ళీ విడుదలకు సిద్ధంగా ఉందనే తాజా వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆంధ్రావాలా చిత్రం (2004) భారీ హైప్ తో విడుదలైంది. అప్పట్లో పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ ఇద్దరూ టాప్ ఫామ్ లో ఉన్నారు. ఎన్టీఆర్ గత చిత్రం సింహాద్రి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ ను భారీ జనసందోహంతో ఏర్పాటు చేయడంతో సినిమా పై హైప్ అదిరిపోయింది.

అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక భారీ డిజాస్టర్ గా నిలిచింది. భారీ పరాజయం పాలవ్వడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. మరి అలాంటి సినిమా రీ రిలీజ్ కావడం అంటే ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయమని చెప్పాలి. కాగా ఆంధ్రావాలా సినిమా రీరిలీజ్ హక్కులను ఓ ప్రైవేట్ సంస్థ కొనుగోలు చేసి మార్చిలో విడుదల చేయనుంది.

READ  Megastar Chiranjeevi: 2024 సంక్రాంతికి ఓ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ నంబర్లు తెచ్చిపెట్టిన పోకిరి రీరిలీజ్ తో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత నుంచి పెద్ద హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా రీ రిలీజ్ అవ్వడం మొదలెట్టాయి. మరి ఆంధ్రావాలా రీరిలీజ్ నిజంగా జరుగుతుందా లేక కేవలం అనౌన్స్ మెంట్ వద్ద మాత్రమే ఆగుతుందా అనేది వేచి చూడాలి. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత సూపర్ హిట్ సినిమాలైన బద్రి, తొలిప్రేమ లను కూడా రీ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసినా చివరికి అనుకోని కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories