టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ ఇటీవల మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1400 కోట్ల గ్రాస్ కలెక్షన్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. అయితే ఆ మూవీ యొక్క ప్రీమియర్ కి అల్లు అర్జున్ తన కుటుంబంతో హాజరై షో వీక్షించారు.
అయితే అదే సమయంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెంది ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా మారింది. అయితే ఆ ఘటన పై అల్లు అర్జున్ ఇటీవల పోలీసులు అరెస్టు చేయగా నాంపల్లి కోర్టు నుండి ఆయన మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ఇక తాజాగా ఆ కేసు విషయమై రేవంత్ రెడ్డి అసెంబ్లీ మాట్లాడుతూ నిప్పులు చెరిగారు.
ఒక సాధారణ కుటుంబం సినిమా చూడడం కోసం వెళ్లి అందులో తల్లి చనిపోయి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటె వారిని కాకుండా కేవలం 13 గంటల్లో జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టడాన్ని తప్పు బట్టారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వంటి నటుడు ఆ విధంగా వ్యవహరించాం సరికాదని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో కొద్దిసేపటిలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. కాగా ఆయన ఏమి మాట్లాడతారో చూడాలని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.