Homeసినిమా వార్తలుPushpa 2: అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ పై అందరి...

Pushpa 2: అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ పై అందరి దృష్టి

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తరం క్రేజీ స్టార్లలో ఒకడు, మరియు తనదైన పనితనంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఆయన గత థియేట్రికల్ రిలీజ్ పుష్ప: ది రైజ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఆ సినిమా యొక్క సీక్వెల్ కోసం అభిమానులు సిద్ధమవుతున్నారు.

కాగా ఇండస్ట్రీ వర్గాలు మరియు మీడియా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ను నిర్మాతలు విడుదల చేయనున్నారట. ఈ వార్త ఆయన అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఉత్సాహపరిచింది. వారంతా ఇప్పుడు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పుష్ప 2 చిత్రం అన్ని భాషల్లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతీయ సినీ ప్రేక్షకులు కూడా పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన సందర్భంగా పుష్ప 2 టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోందనే వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సుకుమార్ అండ్ టీం అంతా తమ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.

READ  Sukumar: ఇండస్ట్రీలో సుకుమార్ అసిస్టెంట్లకు భారీ డిమాండ్

ఇలా పుష్ప 2 చూసేందుకు అందరూ ఆసక్తిగా ఉన్నారు. హద్దులు దాటి ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎన్నో రకాల అడ్డంకులను ఎదుర్కొంటుంది. శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన్న, పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ కనిపించనుండగా, ఆయన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందట. ఈ పాన్ ఇండియా సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం జగపతిబాబును కూడా తీసుకున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Anushka: ఎట్టకేలకు విడుదలయిన నటి అనుష్క శెట్టి కొత్త సినిమా అప్‌డేట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories