అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ నిన్న విడుదలై డిజాస్టర్ కంటెంట్ తో అటు ప్రేక్షకులను, ఇటు అక్కినేని అభిమానులను నిరాశపరిచింది. ఇలాంటి భారీ పరాజయం తరువాత సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు, కొందరు అఖిల్ ను విమర్శిస్తుంటే, మరి కొందరు ఇది సురేందర్ రెడ్డి పొరపాటు అని ఎత్తి చూపుతున్నారు. అయితే ఏజెంట్ సినిమా అఖిల్ చేయాల్సింది కాదని, రామ్ చరణ్ ఏ ఈ సినిమాకి ఛాయిస్ అని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ ఓ ప్రెస్ మీట్ లో తాను రా ఏజెంట్ సినిమా చేస్తానని చెప్పినా ఆ సమయంలో దర్శకుడు, హీరోల కమిట్ మెంట్స్ కారణంగా ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అందుకే కొన్నేళ్ల తర్వాత తాను మిస్సయిన సినిమానే చేయాలని అఖిల్ కు సూచించారట రామ్ చరణ్. ఈ విషయాన్ని అఖిల్ కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే ఏజెంట్ రిజల్ట్ చూశాక తమ అభిమాన హీరో డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడని మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు.
మరో వైపు రామ్ చరణ్ ఈ సినిమాను అఖిల్ కు ఎందుకు సూచించారో అని అక్కినేని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అఖిల్ ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడ్డాడు కానీ ఆ సినిమా ఘోర పరాజయంతో ఆయన కష్టం అంతా వృధా అయింది. తమ హీరోకు రామ్ చరణ్ ఈ స్క్రిప్ట్ సూచించకపోయి ఉంటే ఇంతటి భారీ నిరాశను చవిచూడాల్సి వచ్చేది కాదనే భావనలో అక్కినేని అభిమానులు ఉన్నారు.
అయితే ఒక హీరో నుంచి మరో హీరోకు సినిమాలు మారడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదు. కావాలని ఒక చెడ్డ సినిమాను వేరే హీరోలకు సిఫారసు చేయాలనుకోవడం కానీ, తాము చేయాలని కానీ ఎవరూ అనుకోరు. ఇదంతా విధి లేదా అదృష్టం పై ఆధారపడి ఉంటుంది, సినిమాల్లో ఒకరి నష్టం ఇతరులకు లాభంగా మారుతుంది.