Homeసినిమా వార్తలుAgent Collections: తొలి రోజు దారుణమైన కలెక్షన్స్ వసూలు చేసిన అఖిల్ ఏజెంట్

Agent Collections: తొలి రోజు దారుణమైన కలెక్షన్స్ వసూలు చేసిన అఖిల్ ఏజెంట్

- Advertisement -

అఖిల్ ‘ఏజెంట్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ పై అఖిల్ తో పాటు ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏజెంట్ అందర్నీ నిరాశ పరిచి బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఏజెంట్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.

తొలి రోజు ఏజెంట్ నైజాంలో ఏజెంట్ కేవలం 1.1 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగా, జీఎస్టీతో కలిపి కూడా ఈ షేర్ కేవలం 1.3 కోట్ల వరకు ఉంటుంది. ఇక మొత్తంగా తెలుగు రాష్ట్రాల షేర్ 4.2 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా గా 6 కోట్లు ఉంటుంది. తొలి రోజు నైట్ షోలలో ఈ సినిమా భారీ పతనాన్ని చవిచూసింది, ఇది ఒక సినిమాకు ఊహించనిది. ప్రస్తుత ట్రెండ్, బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సింగిల్ డిజిట్ క్లోజింగ్ షేర్ తో ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఏజెంట్ ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, ముఖ్యంగా పాటలు సినిమా పై కావాల్సిన బజ్ క్రియేట్ చేయడంలో విఫలం కావడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే జరిగాయి. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రీ బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.

READ  Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ లుక్ లీక్

ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గా వ్యవహరించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ విభాగంలో పని చేశారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో నటించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp

We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.

READ  Keeravani: పద్మశ్రీ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories