టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు చేస్తున్నారు. వాటిలో సుజీత్ తీస్తున్న ఓజి, జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి కలిసి తీస్తున్న హరిహర వీరమల్లు, అలానే హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ ఉన్నాయి.
అయితే వీటిలో మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి పై పవన్ ఫ్యాన్స్ లో విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ అనంతరం ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభం కాగా రెండు రోజుల్లో పవన్ ఆ షూట్ లో జాయిన్ కానున్నారు.
విషయం ఏమిటంటే, ఈ మూవీలో పవన్ కళ్యాణ్ యంగ్ లుక్ పాత్రలో ఆయన కుమారుడు అకీరా నందన్ కనిపించనున్నాడనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్. అయితే మూవీ టీమ్ నుండి అందుతున్న న్యూస్ ప్రకారం అది పూర్తిగా ఫేక్ అని తెలుస్తోంది. ఇక ఓజి నుండి త్వరలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధం ఆడియన్స్ ముందుకి రానుంది.