సంక్రాంతి అంటే తెలుగు వారికి ఆనందాల పండుగ మాత్రమే కాదు, సినిమాల పండుగ కూడా. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టేందుకు, అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమాల తీసుకెళ్లేందుకు పెద్ద స్టార్లు తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే.
2023 సంక్రాంతి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న రెండు పెద్ద చిత్రాలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకటి బాలయ్య నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వీరసింహరెడ్డి మరియు వాల్తేరు వీరయ్య అనే మెగాస్టార్ మార్క్ ఎంటర్‌టైనర్.
రామాయణం ఆధారంగా తెరకెక్కగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాను మొదట్లో సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రచారం చేసినప్పటికీ.. టీజర్ లో ఉన్న పేలవమైన వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఆ సినిమా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఇక ఈ సంక్రాంతికి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన వారిసు (వారసుడు) కూడా విడుదలవుతోంది. ఎందుకంటే తమిళ నాట కూడా సంక్రాంతి/పొంగల్ సమానంగా భారీ సీజన్ కాబట్టి. ఇక ఇదే సంక్రాంతికి తమిళ మరో స్టార్ హీరో తలా అజిత్ కూడా సరైన సమయానికి తెర పైకి రాబోతోంది.
ఇక ఇదే క్రమంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతి నుండి తప్పుకోవడంతో.. అఖిల్ అక్కినేని మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి కలయికలో వస్తున్న ఏజెంట్ కి దారి దొరికింది.
నిజానికి ఏజెంట్ సినిమాని మొదట్లో సంక్రాంతికి విడుదల చేయాలని అనుకోలేదు, సడెన్ గా విడుదల తేదీ ప్రకటించడం కారణంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. అయితే సంక్రాంతి పండగకు ఏజెంట్ రాలేదని తాజాగా అంతర్గత వర్గాలు ధృవీకరించాయి. దీంతో సీనియర్ సూపర్‌స్టార్‌లయిన బాలకృష్ణ, చిరంజీవిలకు ఎక్కువ థియేటర్లు మరియు ఎక్కువ ప్రేక్షకులను అలరించే అవకాశం దక్కింది.
ఇక దర్శకుడు వంశి పైడిపల్లి క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను సమాంతరంగా అలరించిన రికార్డును సొంతం చేసుకున్నందున ఇది వారిసు/వారసుడుకి కూడా ప్రయోజనం చేకూరే అంశం అని చెప్పవచ్చు. పరిశ్రమలో అరంగేట్రం చేసినప్పటి నుండి భారీ విజయం పై కన్నేసిన అఖిల్ తన మార్కెట్ బలాన్ని భారీగా పెంచుకునే గొప్ప సినిమా సీజన్‌ను కోల్పోవడంతో నిరాశ చెందవచ్చు.
అయితే ఇలా ప్రణాళిక లేని విడుదలలు పరిశ్రమకు ఎంత మాత్రం మంచివి కావు. ఎందుకంటే ఇలా చేయడం వలన నాణ్యత విషయంలో రాజీపడి షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్‌ను వేగంగా ముగించాలని దర్శకులు తరచుగా ఒత్తిడికి గురవుతారు. ఇటువంటి అవాంఛిత విడుదలలను నివారించడానికి అందరూ ముందుగానే మంచి అవగాహనతో ఉంటారని ఆశిద్దాం.