అఖిల్ ‘ఏజెంట్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ పై అఖిల్ తో పాటు ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏజెంట్ అందర్నీ నిరాశ పరిచి బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఏజెంట్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.
తొలి రోజు ఏజెంట్ నైజాంలో ఏజెంట్ కేవలం 1.1 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగా, జీఎస్టీతో కలిపి కూడా ఈ షేర్ కేవలం 1.3 కోట్ల వరకు ఉంటుంది. ఇక మొత్తంగా తెలుగు రాష్ట్రాల షేర్ 4.2 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా గా 6 కోట్లు ఉంటుంది. తొలి రోజు నైట్ షోలలో ఈ సినిమా భారీ పతనాన్ని చవిచూసింది, ఇది ఒక సినిమాకు ఊహించనిది. ప్రస్తుత ట్రెండ్, బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సింగిల్ డిజిట్ క్లోజింగ్ షేర్ తో ముగిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏజెంట్ ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, ముఖ్యంగా పాటలు సినిమా పై కావాల్సిన బజ్ క్రియేట్ చేయడంలో విఫలం కావడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే జరిగాయి. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రీ బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గా వ్యవహరించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ విభాగంలో పని చేశారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో నటించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు.