Homeసినిమా వార్తలుపోరుకు సిద్ధం అంటున్న బాలయ్య - అఖిల్

పోరుకు సిద్ధం అంటున్న బాలయ్య – అఖిల్

- Advertisement -

అఖండ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి బాలకృష్ణ అభిమానులను అలరించేందుకు తదుపరి సినిమాలను భలే ప్లాన్ చేసుకున్నారు. ఇక ఆయన నుండి వస్తున్న తాజా చిత్రం NBK 107 ను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది వరకే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం జై బాలయ్య మరియు అన్నగారు వంటి టైటిల్స్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏదో ఒక టైటిల్ ను ఫైనల్ చేసి ప్రకటించాలి అని దర్శకుడు ఆలోచిస్తున్నా , ఇంకా హీరో అయిన బాలకృష్ణ నుంచి మాత్రం అందుకు అనుమతి రాలేదు అని తెలుస్తోంది.

ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. అలాగే బాలయ్య పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా అదిరిపోయాయి అని ఒక టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని, మిగిలిన షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

READ  మరో రికార్డును సొంతం చేసుకున్న కేజీయఫ్ -2

ముందుగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల అఖండ అన్నివర్శరీ రోజున రిలీజ్ చేయాలని అనుకున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ రెండు డేట్లు కాదని NBK 107 సినిమాని సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని భావిస్తున్నారట.అయితే సంక్రాంతికి బాలయ్య బాబుతో పాటు అక్కినేని వారసుడు అఖిల్ కూడా తన సినిమాని విడుదల చేస్తున్నారట.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా “ఏజెంట్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. హీరో అఖిల్ 5వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా విజయం సాధించడం అఖిల్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది.

అందుకే సరైన సీజన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు అని తెలియవచ్చింది. ఏజెంట్ సినిమా కూడా ముందుగా దసరా, దీపావళికి విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అవేవీ కాదు క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తున్నారు అని కూడా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి విడుదల చేస్తున్నారని తాజాగా వినిపిస్తుంది.

సంక్రాంతికి ఇదివరకే ప్రభాస్ నటించిన ప్యాన్ ఇండియా సినిమా ” ఆది పురుష్” వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి , నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న “వారసుడు” (తమిళంలో వారిసు) కూడా విడుదల కాబోతుంది. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా విడుదల చేస్తారని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సంక్రాంతి రేసులో నుండి వైదొలగినట్లుగా తెలుస్తోంది.

READ  Mega - 154: మెగాస్టార్ - మాస్ మహరాజ్ కాంబో కన్ఫర్మ్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories