టాలీవుడ్ స్టార్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని ఇటీవల ఏజెంట్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక త్వరలో తన కెరీర్ 6వ మూవీని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అఖిల్. అతి త్వరలో దీనికి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
అయితే మ్యాటర్ ఏమిటంటే, నేడు తన కుమారుడు అఖిల్ అక్కినేని యొక్క ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగిందని నాగార్జున కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. ఢిల్లీ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ జైనబ్ తో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. కాగా ఆమెను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున తన పోస్ట్ లో పేర్కొన్నారు. త్వరలో వీరిద్దరి వివాహ తేదీ అధికారికంగా వెల్లడి కానుంది.
జైనబ్ తండ్రి జుల్ఫీ తో కొన్నేళ్లుగా నాగార్జున తో మంచి అనుబంధం ఉండడం, ఆ తరువాత ఇరు కుటుంబాలకు చెందిన అఖిల్, జైనబ్ ల మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబాలు వీరి వివాహానికి అంగీకరించాయి. మరోవైపు డిసెంబర్ 4న నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత ల వివాహం గ్రాండ్ గా జరుగనుంది. మొత్తంగా అక్కినేని ఫామిలీలో రెండు శుభకార్యాలు జరుగనుండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ అఖిల్, చైతు లకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.