అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్’. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి హిట్ సినిమాతర్వాత అఖిల్ నటిస్తున్న సినిమాపై అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి కలగగా,ఫస్ట్ లుక్ మరియు అఖిల్ సిక్స్ ప్యాక్ పిక్చర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఆ మధ్య కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని రకరకాల పుకార్లు వచ్చినా అవేవీ నిజం కాదని నిర్మాత అనిల్ సుంకర వివరణ ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉండగా సురేందర్ రెడ్డి – అఖిల్ కాంబినేషన్ వల్ల ముందు ముంచే ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా పట్ల చక్కని క్రేజ్ ఏర్పడింది. ఒక ఆ తరువాత మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి వంటి స్టార్ లు ఈ చిత్రంలో భాగం కావడం.. ఇక అఖిల్ లుక్ ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది.
ఇటీవల నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ టీజర్ ను తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ లకు చూపించారని సమాచారం. టీజర్ లోని కళ్ళు చెదిరే విజువల్స్,క్వాలిటీ చూసి అద్భుతంగా ఉందని చెప్పారట.ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న నమ్మకం కలగడంతో డిస్ట్రిబ్యూటర్ లు భారీ ఆఫర్ లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారట. ఈ మేరకు నిర్మాత అనిల్ సుంకర తెలుగు రాష్ట్రాల బిజినెస్ 72 కోట్ల డీల్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. క్రేజ్ ను సరిగ్గా వాడుకుని ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో లేదో చూద్దాం.