టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకుడిగా నేడు అఖండ 2 మూవీ గ్రాండ్ లెవెల్లో హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.
ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమానికి బలకృష్ణ కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని ప్రత్యేకంగా హాజరయ్యారు. కాగా బ్రాహ్మణి ఫస్ట్ షాట్ కి క్లాప్ కొత్తగా తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ స్థాయిలో నిర్మించనున్నారు. కాగా ఈ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందనుండగా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక నేడు ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ టీజర్ ని కూడా రిలీజ్ చేసారు మేకర్స్. తాండవం అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన అఖండ 2 టీజర్ అదిరిపోయింది. ముఖ్యంగా బాలయ్య పవర్ఫుల్ లుక్ తో పాటు థమన్ అద్భుతమైన బిజీఎం ఈ టీజర్ కి ప్లస్ అని చెప్పాలి. కాగా అఖండ 2 కి సంబంధించి త్వరలో ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయి.