టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రిల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితమవుతున్న తాజా మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ అఖండ 2. బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించనుంది
సరిగ్గా మూడేళ్ల క్రితం బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతో పెద్ద ప్రభంజనం సృష్టించి బాలకృష్ణ కెరిర్ పరంగా అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా నిల్చిన విషయం తెలిసిందే. దానితో ప్రస్తుతం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న అఖండ 2 పై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. పవర్ఫుల్ డైలాగ్స్ తో అదిరిపోయే బ్యాక్ స్కోర్ తో రూపొందిన ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక అఖండ 2 మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ఆ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. మరి మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.