టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ పై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
అయితే మూడేళ్ళ క్రితం బాలకృష్ణ తో బోయపాటి శ్రీను తీసిన మూవీ అఖండ. అప్పట్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న ఈ మూవీ అందరి నుండి మంచి పేరు సొంతం చేసుకుంది. బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించిన ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. విషయం ఏమిటంటే, దీనికి సీక్వెల్ గా తాజాగా అఖండ 2 మూవీ అనౌన్స్ అయింది. దానితో ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీని నేటి నుండి పట్టాలెక్కించనున్నారు.
మూవీకి సంబంధించి సాయంత్రం 5 గం. 51 ని. లకు మూవీ నుండి ఒక అప్ డేట్ రానుంది. కాగా పార్ట్ 1 ని మించేలా మరింత భారీ స్థాయిలో దీనిని తెరకెక్కించేలా దర్శకుడు బోయపాటి పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.