టాలీవుడ్ నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అఖండ. మంచి అంచనాలతో మూడేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చిన అఖండ ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకుంది.
మొత్తంగా సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో మూడు బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న బాలకృష్ణ, బోయపాటి ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బాలకృష్ణతో తీసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ ని మించేలా భారీ స్థాయిలో ఈ సీక్వెల్ ని తెరకెక్కించనున్నారు బోయపాటి. ఇక ఈ మూవీకి తాండవం అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అలానే ఈ మూవీలో అఘోర పాత్ర మరింత అద్భుతంగా డిజైన్ చేసారని టాక్.
ఇందులో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా ఇతర కీలక పాత్రధారుల ఎంపిక తాజాగా ప్రారంభం అయిందట. అఖండ పార్ట్ 1 కి తీసుకున్న థమన్ దీనికి కూడా మ్యూజిక్ అందించనుండగా దీనిని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై రామ్ ఆచంట, గోపి ఆచంట గ్రాండ్ లెవెల్లో బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వ్యయంతో నిర్మించనున్నారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ పూర్తి అయి ఆపై రిలీజ్ అనంతరం ఎంతమేర అలరిస్తుందో చూడాలి.