కోలీవుడ్ స్టార్ నటుడు తలా అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా అర్జున్ సర్జా. రెజీనా కాసాండ్రా, నిఖిల్ నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై సుభాస్కరన్ గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో నిర్మించారు.
అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీకి ఓం ప్రకాష్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. బిగినింగ్ నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే మూవీకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ మాత్రం పెద్దగా రెస్పాన్స్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాయి. మరోవైపు మూవీకి పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో ఎంతమేర ఇది విజయవంతం అవుతుందనే భావన కూడా ఆడియన్స్ లో ఉంది.
అయినప్పటికీ అజిత్ భారీ స్టార్డం తో తమిళనాడు లో ఈ మూవీ భారీ స్థాయి ఓపెనింగ్స్ ని రాబడుతోంది. అయితే తెలుగులో మాత్రం బుకింగ్స్ అనుకునేంతటి ఆశాజనకంగా అయితే లేవు. అలానే మూవీని అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే, తమ హీరో మూవీస్ కి ప్రమోషన్స్ అవసరం లేదని, తప్పకుండా విడాముయార్చి విజయం తథ్యం అని అజిత్ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు