Homeసినిమా వార్తలుThunivu: నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించిన అజిత్ తునివు

Thunivu: నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించిన అజిత్ తునివు

- Advertisement -

అజిత్ నటించిన తునివు సినిమా కొన్ని రోజుల క్రితం డిజిటల్ ప్రీమియర్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ఊహించిన దాని కంటే అతి భారీ స్థాయిలో సంచలనం సృష్టించింది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్ ఫారంలో తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది.

https://twitter.com/rameshlaus/status/1624970379537309696?t=_FSnbsU0aBbHotoPUzEeUA&s=19

ఈ చిత్రం యొక్క బహుళ వెర్షన్లు అనేక దేశాలలో టాప్ 3 స్థానాలలో ట్రెండింగ్ లో ఉన్నాయి. తమిళ వెర్షన్, హిందీ వెర్షన్, తెలుగు వెర్షన్ ఇలా పలు దేశాల్లో వరుసగా టాప్ పొజిషన్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. పొంగల్ కు జనవరి 12న విడుదలైన తునివు చిత్రం అజిత్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల మార్కును దాటింది.

https://twitter.com/rameshlaus/status/1624969333205266434?t=n8yQz0acGcmWqb0x7uvkEg&s=19

అజిత్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, హెచ్.వినోద్ ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో సముద్రఖని, మంజు వారియర్, జాన్ కొక్కెన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ అంశాలు సినిమాను మంచి ఓపెనింగ్స్ తెచ్చి పెట్టాయి. తునివు అజిత్ కు కెరీర్ బెస్ట్ ఫస్ట్ వీక్ నంబర్స్ అందించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి వారంలో తమిళనాడులో 90 కోట్లు కలెక్ట్ చేయగా, దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు మొదటి వారం తర్వాత 110 కోట్లకి దగ్గరగా ఉన్నాయి.

READ  Pushpa: అల్లు అర్జున్ అభిమానులకు, ప్రేక్షకులకు పుష్ప టీం సంక్రాంతి గిఫ్ట్

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న తునివు చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. కాగా భారీ బజ్ మధ్య ఫిబ్రవరి 7న ఈ చిత్రం ఓటీటీ ప్రీమియర్ గా విడుదలైంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories