Homeసినిమా వార్తలుThunivu OTT: ఈ రోజు రాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న అజిత్ లేటెస్ట్ బ్లాక్...

Thunivu OTT: ఈ రోజు రాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న అజిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘తునివు’

- Advertisement -

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన హెయిస్ట్ థ్రిల్లర్ ‘తునివు’ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 8న అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు) దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల కానుంది.

https://twitter.com/Netflix_INSouth/status/1622927193134481408?t=T7DNCb4kwIlVh_ut9gL7pg&s=19

యువర్ బ్యాంక్ ను దోచుకోవడానికి, దోచుకున్న డబ్బును పంచుకోవడానికి కుట్ర పన్నిన దుండగుల బృందంతో ఒక పోలీసు ఒప్పందం కుదుర్చుకోవడంతో తునివు చిత్రం ప్రారంభమవుతుంది. ఈ ముఠా తమ ప్రణాళికను ప్రారంభించి బ్యాంకులోకి ప్రవేశిస్తుంది, అయితే అప్పటికే బ్యాంక్ లోపల డార్క్ డెవిల్ (అజిత్ కుమార్) అనే మరో వ్యక్తి కూడా బ్యాంక్ ను దోచుకోవడానికి వచ్చాడని తెలుసుకుంటారు.

ఆ డార్క్ డెవిల్ కొంతమంది దుండగులను హతమార్చి కస్టమర్లు, ఉద్యోగులు, ఇతర దుండగులను కూడా బందీలుగా చేసుకుంటాడు. అతను ఎవరు? బ్యాంకులో దోపిడీకి ఎందుకు ప్లాన్ చేశాడు? అతనికి ఎవరు సహాయం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ.

READ  Mythri Movie Makers: డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్

తునివు మొదటి రోజు ప్రారంభ షోల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కాకపోవడంతో ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల నుంచి అందరూ గత అజిత్ సినిమా వలిమై మాదిరిగానే ఈ సినిమా కూడా నష్టాల బాట పడుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా అందరి అంచనాలను మించిపోయి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

‘తునివు’లో అజిత్ నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అయితే అజిత్ లాంటి స్టార్ హీరోతో సినిమాను హ్యాండిల్ చేయడంలో దర్శకుడు హెచ్.వినోద్ ఇంకాస్త జాగర్తగా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు మరియు విమర్శకులు అన్నారు. మంజు వారియర్, మోహన సుందరం, సముద్రఖని, జాన్ కొక్కెన్, వీర ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తునివు జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

Follow on Google News Follow on Whatsapp

READ  HIT 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అడివి శేష్ తాజా బ్లాక్ బస్టర్ హిట్ 2


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories