కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి గుడ్ బాడ్ అగ్లి. ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక మరోవైపు మరొక దర్శకుడు మజిల్ తిరుమేణి తెరకెక్కిస్తున్న విడాముయార్చి మూవీ కూడా చేస్తున్నారు అజిత్ కుమార్.
ఈ రెండు మూవీస్ పై అజిత్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, నేడు కొద్దిసేపటి క్రితం విడాముయార్చి మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఆకట్టుకునే యాక్షన్, థ్రిల్లింగ్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ తో ఈ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇక తమ మూవీని 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ టీజర్ లో ప్రకటించారు. అయితే ఈ మూవీ తమిళనాడులో చరణ్ గేమ్ ఛేంజర్ కి థియేటర్స్ విషయంలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన విడాముయార్చి రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.