కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ విడాముయార్చి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో అర్జున్ సర్జా, రెజీనా, నిఖిల్ నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ రిలీజ్ అయి అందరినీ నిరాశపరిచింది.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై ఈ మూవీని సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఒక రోజులో జరిగే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈమూవీ లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ యొక్క అఫీషియల్ రీమేక్ రైట్స్ తీసుకోకుండా విడాముయార్చి మూవీని తెరకెక్కిస్తుండడంతో ఆ మూవీ మేకర్స్ పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
అలానే లీగల్ గా దీనిపై వారు పోరాడేందుకు సిద్దమయ్యారట. దానితో ఈ మూవీ లీగల్ సమస్యల్లో చిక్కున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమస్య ఎలా తీరుతుందో, మరి పక్కాగా మూవీ రానున్న సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదో అని అజిత్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి లీగల్ సమస్యల పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.