తమిళ స్టార్ నటుడు తలా అజిత్ కుమార్ ప్రస్తుతం మగిళ్ తిరుమేని దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడాముయార్చి తో పాటు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తున్నారు. ఇవి రెండు ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ ఏడాది అక్టోబర్ 31న విడాముయార్చి, అలానే 2025 సంక్రాంతి కానుకగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఈ రెండు సినిమాల పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే, త్వరలో కెజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అజిత్ ఒక మూవీ చేయనున్నారని, దానిని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.
తాజాగా తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అది నిజమే అంటున్నారు. అందులో ఫస్ట్ పార్ట్ సోలోగా తెరకెక్కనుండగా రెండవ పార్టుకి కెజిఎఫ్ చాప్టర్ 3 తో లింక్ ఉండే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే దీని పై టీమ్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. కాగా ఇది అజిత్ కెరీర్ 64వ మూవీగా రూపొందనుంది.