ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో స్టార్ దర్శకుడిగా ఎంతో గొప్ప క్రేజ్ తో ఆడియన్స్ మనసులో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ముందుగా 2014లో వచ్చిన ఉగ్రం మూవీతో కన్నడలో మెగా ఫోన్ పట్టిన ప్రశాంత్ ఆ తరువాత కెజిఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అవి రెండు కూడా ఒకదానిని మించేలా మరొకటి పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టిన విషయం తెలిసిందే.
ఇటీవల పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఆయన తీసిన సలార్ కూడా విజయవంతం అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు ప్రశాంత్, దీని అనంతరం సలార్ 2, కెజిఎఫ్ 3 కూడా చేయనున్నారు. అయితే లేటెస్ట్ కోలీవుడ్ బజ్ ప్రకారం ఇటీవల తలా అజిత్ కుమార్ కి ప్రశాంత్ నీల్ రెండు పవర్ఫుల్ స్టోరీస్ ని వినిపించారని, కాగా వాటిలో ఒక మూవీ సపరేట్ గా రూపొందనుండగా మరొక మూవీకి కెజిఎఫ్ 3 తో లింక్ ఉంటుందని, ఆ విధంగా ఆ కథ సాగుతుందని టాక్.
ఇక అజిత్ కి ఆ రెండు స్టోరీస్ ఎంతో నచ్చడంతో త్వరలో వాటికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.