కోలీవుడ్ స్టార్ నటుడు తలా అజిత్ కుమార్ ప్రస్తుతం రెండు సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న విడాముయార్చి మరియు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీమూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ విడుదలై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచాయి.
కాగా వీటిలో విడాముయార్చి ఈ ఏడాది అక్టోబర్ 31న గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే విషయం ఏమిటంటే, తాజాగా హీరో అజిత్ ని కెజిఎఫ్ సిరీస్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల కలిసి రెండు పార్ట్ ల సిరీస్ యొక్క మూవీ స్టోరీ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని, అలానే వాటిలో రెండవ పార్ట్ కి త్వరలో రూపొందనున్న కెజిఎఫ్ 3తో లింక్ ఉందని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా వాటిపై కెజిఎఫ్ సిరీస్ సినిమాల నిర్మాతలు హోంబలె ఫిలిమ్స్ వారు క్లారిటీ ఇచ్చారు. నిజానికి ప్రస్తుతం వార్తలు వస్తున్నట్లుగా అజిత్ కుమార్ గారు తమ కెజిఎఫ్ 3 మూవీలో నటించబోవడం లేదని తెలిపారు. దీనితో ఈ పుకార్లకు ఒక్కసారిగా చెక్ పడింది.